calender_icon.png 29 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సామూహిక మరుగుదొడ్లపై అక్రమార్కుడి కన్ను

29-11-2025 01:06:55 AM

న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా 

అయిజ, నవంబర్ 28: మహిళల ఆత్మగౌరవం కోసం గత 50 ఏళ్ల కిందట నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల పైన ఓ అక్రమార్కుడు కన్ను పడింది. దీంతో ఆ మరుగుదొడ్లను పడగొట్టి అట్టి స్థలం నాదేనని మాకు ఇంటి నెంబర్లు కూడా ఉన్నారంటూ తప్పుడు అసెస్మెంట్ లు పొంది కాలనీవాసులను  బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు, కాలనీ వాసులు ,యువకులు న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు చేపట్టారు.

ఈ ఘటన గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రం శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీవాసులు,మహిళలు తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపాలిటీ కేంద్రంలో 3 వార్డులో గత 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో సుమారు 8 సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు.అయితే ఓ వ్యక్తి ఆ  స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు మరుగుదొడ్లను పడగొట్టేందుకు పూనుకున్నాడు.దీంతో కాలనీవాసులు ఆగ్రహించి అసలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తికి అసెస్మెంట్ ఇంటి నంబర్లు ఎలా ఇస్తారని కమిషనర్ నిలదీశారు.

కబ్జాదారునికి అధికారులు సహకరిస్తున్నట్లు  ఆరోపించారు. ధర్నా చేపట్టారు.ఇట్టి అంశంపై కమిషనర్ సైదులు స్పందిస్తూ .. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సామూహిక మరుగుదొడ్లకు హద్దులు ఏర్పాటు చేసి రూ.20 లక్షలతో అధునాతన మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమార్కులకు ఇచ్చిన అసెస్మెంట్ 3 నంబర్లను డిలీట్ చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవరాజు, నాయకులు యోబు ,మైనర్ బాబు, కాలనీ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.