29-11-2025 01:07:05 AM
నాగల్ గిద్ద, నవంబర్ 28 : నాగల్ గిద్ద మండల కేంద్రంలోని కరస్ గుత్తి గ్రామంలో సామాజిక ఆసుపత్రి కేంద్రాన్ని శుక్రవారం సంగారెడ్డి జిల్లా డిసిహెచ్‌ఓ షరీఫ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లో జరుగుతున్నసేవలను అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్ వినోద్ మంచి సేవలు అందిస్తున్నారని వారు ప్రశంసించారు. త్వరలో డాక్టర్లను నియమిస్తామని, ఆసుపత్రులు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తామని తెలిపారు. 102, 108 ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉండే విధంగా చూస్తామని తెలిపారు. వారితోపాటు ఇంచార్జ్ సూపర్డెంట్ అనురాధ, ఆస్పత్రి సిబ్బంది శ్రీదేవి, శ్రీనివాస్, మాధవి, జోష్నా, శ్రీదేవి, శానిటేషన్ సూపర్వైజర్ గురుస్వామి తదితరులు ఉన్నారు.