25-10-2025 12:05:04 AM
నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ టీజర్‌తో లెజెండ్ అఖండ పాత్రను పరిచయం చేశారు.
ఇప్పుడు బాలకృష్ణ మరో పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ ‘అఖండ2: బ్లాస్టింగ్ రోర్’ పేరుతో మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుం టోంది. ‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో. ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు. ఊహకి కూడా అందదు’ అని బాలకృష్ణ చెప్పిన డైలాగు గూజ్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.