calender_icon.png 25 October, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పాటే సినిమాకు ప్రాణం

25-10-2025 12:06:16 AM

యంగ్ హీరో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకు డు సందీప్‌రాజ్ అడవి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బండి సరోజ్‌కుమార్ విలన్ పాత్ర పోషిస్తుండగా, హర్ష చెముడు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. శుక్రవారం ఫస్ట్ సింగిల్ ‘సయ్యారే’ను విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం, కాలభైరవ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ గీతాన్ని ఐశ్వర్య దారురితో కలిసి కాలభైరవ ఆలపించారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ.. “సందీప్, కాలభైరవ కాంబినేషన్ ఐదేళ్ల తర్వాత వస్తుంది.

ఆ కసి ఈ పాటలో కనిపిస్తుంది. చంద్రబోస్ తన లిరిక్స్‌తో పాటకు, సినిమాకు ప్రాణం పోశారు. అంతా ఈ సినిమాని ప్రేమిస్తారకుంటున్నా” అన్నారు. ‘ఇది నా ఫస్ట్ సినిమా. నా లైఫ్‌లో మెమొరబుల్ డే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. సయ్యారే పాట నా మనసుకు చాలా దగ్గర అయింద’ని హీరోయిన్ సాక్షి తెలిపారు. డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. “ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఈ పాట నచ్చితే దానికి పది రెట్లు సినిమా నచ్చుతుంది.

ఇది 100% ఫ్యామి లీ ఫిలిం” అని చెప్పారు. ని ర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “కంట్రోల్ బడ్జెట్లో క్వాలిటీ ఏమాత్రం మి స్ అవకుండా పెద్ద స్పాన్ లో తీసిన సినిమా ఇది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే లవ్‌స్టోరీ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అన్నారు. పొడ్యూసర్ కృతిప్రసాద్ మాట్లాడుతూ.. “సయ్యారే’ నా ఫేవరెట్ సాంగ్. ఇది హార్ట్ ఆఫ్ ది ఫి లిం” అని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఇంకా సంగీత దర్శకుడు కాలభైరవ, నటుడు హర్ష, చిత్రబృందం పాల్గొన్నారు.