25-10-2025 12:04:04 AM
మురళీ కృష్ణంరాజు, శ్రుతిశెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకత్వంలో నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృథ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న.
ఈ చిత్రం నుంచి ‘పోయేకాలం నీకు..’ అనే పాట రిలీజైంది. శివప్రసాద్ కం పోజ్ చేసిన ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ రాయగా, యదు కృష్ణన్, వల్లవన్ పాడారు. ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్‌కే మణి బమ్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: రసూల్ ఎల్లోర్; ఎడిటర్: - సురేశ్ ఆర్స్.