calender_icon.png 23 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుకనూరు సంఘాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం

23-01-2026 12:07:42 AM

భీమదేవరపల్లి జనవరి 22 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘా న్ని శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ,పంచాయతీ రాజ్ శ్రీలంకలోని భార త హైకమిషన్ సంయుక్తంగా, శ్రీలంకకు చెం దిన సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధుల కోసం ఒక ఎక్స్పోజర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించేందుకు పలు దశల్లో చర్చలు నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిధి బృందం 2026 జనవరి 19న భారత్కు చేరుకుంది. మొత్తం 10 రోజులపాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో వ్య వసాయం, ఉద్యానవనం, జీవనోపాధి ప్రో త్సాహం, సహకార బ్యాంకులు, మహిళల నేతృత్వంలోని కార్యకలాపాలు, ఎకోటూరిజం వంటి రంగాల్లోని ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం లక్ష్యంగా ఉంది.ఈ నేపధ్యంలో, గ్రామీణ సహకార రంగంలో ఆద ర్శంగా నిలిచిన ములుకనూర్ కో ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ మార్కెటింగ్ సొసైటీ, ములుకనూర్ను సందర్శించేందుకు ప్రతినిధి బృం దం షెడ్యూల్ చేయబడింది.

ఈ సందర్శన ద్వారా ములుకనూర్ సహకార సంఘం చేపడుతున్న వివిధ కార్యకలాపాలు, రైతుల సామాజికఆర్థిక స్థితిగతుల అభివృద్ధికి అందిస్తున్న మద్దతు, మధ్యవర్తుల పాత్రను తొల గించి రైతులకు న్యాయం చేయడం వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. అలాగే, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళల నేతృత్వంలోని డెయిరీ యూనిట్ను కూడా ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు.

ఈ ఎక్స్పోజర్ కార్యక్రమం ద్వారా ప్రతినిధి బృందం తమ తమ స్థానిక మండలాల్లో అమలు చేయగలిగే ఉత్తమ విధానాలను అవగాహన చేసుకుని, అమలు చేసే దిశగా ప్రేరణ పొందుతారని ఆశాభావం వ్యక్తం చే శారు. ఈ సందర్భంగా, ములుకనూర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఆలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రతినిధులతో పరస్పర చర్చలు నిర్వహించి, వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

అంతర్జాతీయ ప్రతినిధి బృందం కోసం ములుకనూర్ కోఆపరేటివ్ను ఎంపిక చేయడం అనేది, ములుక నూర్ మోడల్ తన సభ్య రైతుల జీవితాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, తమ తమ మండలాల్లో సాధ్యమైన మేరకు ఈ మోడల్లోని కొన్ని కార్యక్రమాలను అమలు చేయాలని ప్రతినిధులకు సూచించారు.