calender_icon.png 23 January, 2026 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా నీటి సంపు

23-01-2026 12:07:25 AM

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ప్రాణసంకటం

నాగల్ గిద్ద, జనవరి 22 : పాఠాలు చదువుకునే పాఠశాలలో నీటి సంపు ప్రమాదకరంగా మారింది. నాగల్ గిద్ద మండల పరిధిలోని షాపూర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ్ పాఠశాల నిధుల ద్వారా పాఠశాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు అర్ధాంతంగా చేసి పాఠశాల ఆవరణలో ఆరు ఫీట్ల లోతు ఉన్న నీటి నిలువ సంపుపై మూత లేకుండా అలాగే వదిలిపెట్టారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలపై ఏర్పాటు చేసిన సింటెక్స్ లో నీళ్లు వచ్చే విధంగా మోటార్ బిగించాలని కోరుతున్నారు. పాఠశాలకు విద్యార్థులు నీరు తాగడానికి కూడా ఏర్పాటు చేసిన నీటి కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయని వాపోయారు. పాఠశాల ప్రధానోధ్యాయులు అనంత్ కుమార్ ను వివరణ కోరగా కాంట్రాక్టర్ నీటి నిల్వసంపుపై మూత ఏర్పాటు చేయలేదని, నీటి కనెక్షన్ పూర్తి కాలేదని, ఈ విషయం గ్రామ అధికారులకు తెలిపినట్లు చెప్పారు.