calender_icon.png 5 August, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగురాలు మరో వికలాంగుడికి చేయూత

05-08-2025 12:48:02 AM

ఇల్లెందు, ఆగస్టు 4 (విజయక్రాంతి):ఒక వికలాంగురాలు తన వద్ద ఉన్నటువంటి బ్యాటరీ సైకిల్ ని మరో వికలాంగుడికి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇల్లందు పట్టణంలోని 21 ఫీట్ ఏరియాకి చెందిన గాదె జ్యోతి తన వద్ద ఉన్నటు వంటి బ్యాటరీ సైకిల్ ఉపయోగించు కోకపోవడంతో దాన్ని మరో వికలాంగుడికి ఒక ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వికలాంగ సంఘ అధ్యక్షుడు ముజాహిద్ అలియాస్ సాజన్ కి తెలియజేయగా దానికి కొన్ని మరమ్మతులు చేయించిన ఆయన రాజేష్ అనే వికలాం గుడికి అందించారు.

నీ అవయవాలు సక్రమంగా ఉండి మన ఇంట్లో ఉండాల్సిన వస్తువుల కంటే అదనంగా ఉన్నప్పటికీ వాటిని మరొకరికి ఇచ్చేందుకు మనసు ఒప్పని వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో వికలాంగు రాలైన జ్యోతి తన వద్ద ఉన్న బ్యాటరీ సైకిల్ ని తాను వినియోగించుకోక పోవడంతో నిరుపయోగంగా ఎందుకు ఉండాలన్న సదుద్దేశం మంచి మనసుతో మరొకరికి ఉపయోగపడాలని అందించడం పట్ల వికలాంగ సంఘం తోపాటు పలువురు ఆమెను ప్రశంసించారు.