05-08-2025 12:48:55 AM
చిగురుమామిడి, ఆగష్టు 4(విజయక్రాంతి)::రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టటపడి గ్రామగ్రామాన బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, హుస్నాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీఎమ్మెల్యే ఎన్ వి ఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ లో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమా వేశాన్ని హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని,గ్రామాలలో జరిగే అభివృద్ధికి నిధులు కేంద్రం నుండే వస్తున్నాయన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మోడీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపేదలకు ఉపాధి కల్పిస్తున్నారని, పేదలు ఆకలితో అలమటించకుండా కరోనా సమయం నుండి ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పేదరికం తగ్గుముఖం పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు 42శాతం బీసీ రిజర్వేషన్ లో ముస్లిం లను కలిపి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని అన్నా రు.
కాంగ్రెస్ అంటేనే మోసం అని ప్రజలు కాంగ్రెస్ ను నమ్మవద్దని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని 10వ తరగతి పిల్లలకు ఉచిత సైకిళ్ళు పంపిణీ చేస్తున్నారని,రోడ్లు,మంచి నీటి బోర్లు,జిమ్ములు,వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల అవసరా లు తీర్చుతున్నారని అన్నారు.
నరేంద్ర మోదీ, బండిసంజయ్ చేస్తున్న కృషి బిజెపి పార్టీ విధానాలను ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపుని చ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దురిశెట్టి సంపత్, వీరమల్ల రవీందర్ రెడ్డి, బొమ్మగాని సతీష్, మాచర్ల కుమార్, ఖమ్మం వేంకటేశం, వెల్దండి రాజేంద్రప్రసాద్, కుడుతడి చిరం జీవి,ఎర్రగొల్ల శ్రీనివాస్,వీరాచారి,పోలోజు సంతోష్,భూక్యా సంపత్ నాయక్,రామంచ మహేందర్ డ్డి,జాలిగాం రమేష్,దెంచనాల శ్రీనివాస్, పార్టీ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.