16-10-2025 01:18:57 AM
ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డ్యూడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ కాగా, శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “ఇది విభిన్నమైన ప్రేమకథ. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. అందమైన, భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ఉంటాయి. మనం సెకండ్ హాఫ్ గెస్ చేస్తుంటాం. కానీ ఈ సినిమా గెస్సింగ్‌కి భిన్నంగా ఉంటుంది. తమిళ్‌తో సమానంగా తెలుగులో ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.