calender_icon.png 16 October, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రమండలిపై నాకున్నది మూఢనమ్మకమే!

16-10-2025 01:22:42 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజాచిత్రం 

‘మిత్రమండలి’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీ వర్క్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాస్ సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.

బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. 

సినిమా సందేశాలతో సమాజం మారదు: 

‘జాతిరత్నాలు’ టైమ్‌లో అనుదీప్ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. ఇందులోనేమో కులవ్యవస్థపై విజయేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల ద్వారా ఇచ్చే సందేశాలతో సమాజం మారుతుందని నేను నమ్మను. 

ఎవ్వరి మనోభావాలూ దెబ్బ తినవు: 

‘మిత్రమండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్‌గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.

‘జాతిరత్నాలు’ టైమ్‌లో అనుదీప్ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. ఇందులోనేమో కులవ్యవస్థపై విజయేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల ద్వారా ఇచ్చే సందేశాలతో సమాజం మారుతుందని నేను నమ్మను. 

ఫేక్‌గాళ్లను ఏమీ చేయలేం: 

విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ, కావాలనే ద్వేషాన్ని ప్రదర్శి స్తున్నారు. కించపర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వాళ్ల కోసం మేం నలుగురు కలిసి ఆ ఫన్నీ వీడియో చేశాం. అలా టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేసేవాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం?! 

ఎదుటివాళ్లను తక్కువ చేసేదే క్రింజ్ కామెడీ: 

అవతలి వాళ్లను నవ్వించే ప్రయ త్నం చేయడం తప్పు కాదు. కానీ, ఎదుటివాళ్లను తక్కువ చేసి కామెడీ చేయ డమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్నిసార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతు న్నప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేస్తారు. కొన్ని కొందరికి వర్కౌట్ అయితే, ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.

ప్రేక్షకులిచ్చే ఫలితమే ఫైనల్: 

‘మిత్రమండలి’తోపాటు మరో మూడు సినిమాలు వస్తున్నాయి. మేం ప్రీమియర్ వేస్తుండటంతో ముందుగా వస్తున్నట్టయింది. రిజల్ట్ కూడా ముందే వస్తుంది. ప్రీమియర్స్ మాకు ప్లస్ అవుతాయనే అనుకుంటున్నా. మేం ఎంత చెప్పినా ప్రేక్షకులిచ్చే ఫలితమే ఫైనల్ అవుతుంది.