calender_icon.png 28 January, 2026 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు పని దినాలు అమలు చేయాలి

28-01-2026 12:00:00 AM

సిద్దిపేటలో సమ్మె చేసిన బ్యాంకర్లు 

సిద్దిపేట, జనవరి 27 (విజయక్రాంతి) : వారంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ సిద్దిపేటరీజినల్ సెక్రటరీ బి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.5 పని దినాలు అమలు కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పలు బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి మంగళవారం సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్, క్రాంతికుమార్, మహేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్యూలు, ఐటీ, కార్పోరేట్ రంగాల్లో వారంలో ఐదు రోజుల పని అమల్లో ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కాకపోవడం అసమానత్వానికి నిదర్శనమన్నారు. ఐదు పని దినాలు అమలు చేస్తే, ఉద్యోగుల ఆరోగ్యం మెరుగుపడి, ఒత్తిడి లేకుండా వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందుతాయన్నారు. ఎస్బీఐ ఓబీసీ అసోసియేషన్ మహేష్, ఆఫీసర్స్ యూనియన్ రీజినల్ సెక్రటరీ రమేష్, వివిధ బ్యాంక్లకు చెందిన సుమారు 200మంది సిబ్బంది పాల్గొన్నారు.