28-01-2026 12:00:00 AM
పాలమూరు ఎంపీ డీకే అరుణ
గద్వాల జనవరి 27: దేశం బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుందని, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజ యఢంకా మోగిస్తామని పాలమూ రు ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం రోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమయ్యారని ఆమె తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. పదేండ్లలో గద్వాలలో అభివృద్ది కుంటుప డిందని అన్నారు. ఇవ్వాళ గద్వాల మున్సిపాలిటీలలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉందని, ఇండ్లు లేని నీరుపేదలకు ప్ర భుత్వాలు అన్యాయం చేస్తుందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు గద్వాలలోని పిల్లిగుండ్లలో మూడువేల మంది నిరుపేదలకు ఇండ్ల ప ట్టాలు పంపిణి చేయడం జరిగిందన్నారు.ప్రైవేటు భూములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి.. మా ర్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని భావించి.. సొంత నిధులు అదనంగా ఖర్చు చేసి 78 ఎకరాల భూమి కొనుగోలు చేసి పేద లకు పట్టాలు పంపిణీ చేసినట్లుతెలిపారు.ప్రస్తుత గద్వాల ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారో.. కాంగ్రెస్ లో ఉన్నారో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఒక వే ళ గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అయితే ఆ పార్టీ నుంచి ఓట్లు అడగాలి.. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లడగడం సిగ్గు చేట్టన్నారు. ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని స్పష్టం అవుతోందని, అభివృద్ధి కోసం అధికార పా ర్టీకి వెళ్ళమని అంటున్నారు.. ఏం అభివృద్ధి చేశారో గద్వాల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు పంపిణీ చే సిన ప్లాట్ల పట్టాలు లాక్కొని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ చూపెట్టి గద్దెనెక్కిన ఎమ్మెల్యే ఇప్పటికి ఆ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. గద్వాల లో ఆసుపత్రికి, స్కూల్ కి, కాలేజికి అన్నింటికి ఆ భూమిని వినియోగిస్తున్నారు.తన హయాంలో 2లక్షల ఎకరాలకుసాగు నీళ్లు అందించేందుకు నెట్టెంపాడు ఎ త్తిపోతల పథకాన్ని కొట్లాడి తీసుకువస్తే.. గత బీఅర్‌ఎస్ ప్ర భుత్వం తామే చేసిందని గొప్పోలు చెప్పుకోవడం విడ్డూరం అ ని, అలా చెప్పుకోవడానికి వాళ్ళది నోరా ,మోరా అర్ధం కా వడం లేదని మండిపడ్డారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా అందరూ కలసి బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.