calender_icon.png 11 December, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు రహిత నగరమే లక్ష్యం

11-12-2025 12:30:20 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వచ్చే వర్షాకాలం నాటికి వరద ముప్పు లేని నగరంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం కావాలి అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే వర్షాకాలం సన్నద్ధతపై బుధవారం హైడ్రా కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ మెయింటెనెన్స్ విభాగం, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడు తూ.. జనవరి నుంచే నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. డీసిల్టింగ్ పనుల పర్యవేక్షణలో కేవలం అధికారులే కాకుండా స్థాని క నివాసితులు, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని కమిషనర్ సూచించారు. ‘ముంపు సమస్య పరిష్కారంలో స్థాని కులను కలుపుకుపోవాలి.

అప్పుడే నాలాల నిర్వహణలో వారు కూడా జాగ్రత్తగా ఉం టారు. గతంలో టోలీచౌకి, యాకుత్‌పురా ప్రాంతాల్లో పూడికతీత పనులు చేపట్టినప్పుడు స్థానికులు, నేతలు పూర్తి సహకారం అందించారు. అదే స్ఫూర్తితో బస్తీ బాట ద్వారా ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి అని పేర్కొన్నారు. నాలా ఆక్రమణల తొలగింపు, పూడికతీత విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజ ల రక్షణే మనకు ముఖ్యమన్నారు.