calender_icon.png 11 December, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించం

11-12-2025 12:28:59 AM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ వినయ్ కుమార్

ముషీరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని  బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ డివిజన్ ఎస్‌ఆర్టి లోని సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాలీ స్థలం కబ్జాకు  గురవుతుందని స్థానికులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్  ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్  సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.

తమకు అందిన ఫిర్యాదు మేరకు మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వివరాలపై సమీక్షించి ఖాలీ స్థలంలో ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేసి కబ్జా బారి నుండి కాపాడా లని కోరారు.  ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే అక్రమదారులు ఎవరైనా సరే సహించేది లేదని హెచ్చరించారు. ఈ  కార్యక్రమంలో స్థానికులు పి. రాజేశ్వర్ రావు, పవన్, శ్రీనివాస్, అశోక్, సక్కుబాయి, పద్మ, మంజుల, రాధ, శ్రీదేవి, లింగమ్మ,  బిజెపి నాయకులు,  ఆనంద్ రావు, సాయి కుమార్, అరుణ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.