calender_icon.png 11 December, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌లో కిసాన్ షాపింగ్ మాల్

11-12-2025 12:31:10 AM

  1. ఘనంగా 12వ బ్రాంచ్ ప్రారంభం

హాజరైన సినీనటి అనసూయ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): మెదక్ పట్టణంలో కిసాన్ గ్రూప్ తన 12వ షాపింగ్ మాల్‌ను బుధవారం ప్రారంభించింది. ప్రారంభోత్సవాన్ని ప్రము ఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిసాన్ గ్రూప్ చైర్మన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ ఉన్నారు. ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘కిసాన్ మాల్‌లో ని తాజా ఫ్యాషన్ కలెక్షన్లు, విశాలమైన షాపింగ్ స్పేస్, కుటుంబం మొత్తం కోసం అందుబాటులో ఉన్న విభిన్న విభాగాలు నాకు చాలా నచ్చాయి. ప్రారంభోత్సవం చే యడం చాలా సంతోషంగా ఉంది. మెదక్ ప్రజలకు ఇక్కడ అద్భుతమైన షాపింగ్ అనుభవం లభించనుంది‘ అన్నారు.

కిసాన్ గ్రూ ప్ చైర్మన్ ధన్‌పాల్ సూర్యనారాయణ మా ట్లాడుతూ.. ‘మేము మెదక్ ప్రజల అభిరుచులు, డిమాండ్ను పరిగణలోకి తీసుకుని కిసాన్ మాల్‌ను రూపొందించాము. నాణ్య త, స్టైల్, వినియోగదారుల సంతృప్తి మా ప్రధాన లక్ష్యాలు’ అన్నారు. ప్రారంభ రోజునే మాల్‌కు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఈ మాల్ మెదక్ వాణిజ్య, సేవా రంగానికి కొత్త ఊపును తీసుకువస్తుంది.