23-05-2025 12:56:09 AM
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. సుమారు రూ. 1,000కోట్ల వ్యయంతో ఎంఎంటీఎస్ ఫేజ్-2 నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను తక్కువ చేస్తూ ట్విటర్‌లో విమర్శలు చేసే మాజీమంత్రి నిజాలను గ్రహించాలని, అవసరమైతే ఆయనకు లేఖ పంపుతానని కేటీఆర్‌ను ఉద్దేశించి కిషన్‌రెడ్డి విమర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..
కాజీపేటలో రూ. 580కోట్లతో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రధాని భూమిపూజ చేస్తే..గత సీఎం కుమారుడు (కేటీ ఆర్) హాజరుకాలేదని, అభివృద్ధికి మద్దతు చెప్పకుండా విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు.
ప్రధాని మోదీ చొర వతో దేశవ్యాప్తంగా రైల్వేవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా భారత్‌లో 1300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం జరుగుతోందని, తెలంగాణలో కూడా ఒకే సమయంలో 40రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2026 నాటికి ఈ స్టేషన్లను స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చి దిద్దుతామన్నారు.
సి కింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.720కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.350కోట్లు కేటాయించామని, వచ్చే ఏడాది ఈ రెండు స్టేషన్లు పునఃప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,337 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటివరకు రూ.42,219 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయ ని, కొమురవెళ్లి రైల్వేస్టేషన్‌ను దసరా పం డుగ రోజున భక్తులకు అంకితం ఇస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో మహిళా ఉద్యోగులే సేవలు అందించడం గర్వకారణమన్నారు.
యాదగిగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరు..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ ఫేజ్ ఆరేడేళ్లు ఆలస్యం జరిగిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోయినా రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఎం ఎంటీఎస్ ఫేజ్ -2 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైంద ని రూ.400 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రైల్వే ప్రమాదాల నివారణ కోసం తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద 617 కిలోమీటర్ల మేరకు ‘కవచ్’టెక్నాలజీని తీసుకొచ్చినట్లు, 121 అన్‌మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్‌లను తొలిగించినట్లు చెప్పారు. కొత్తగా 203 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు, 42 ఆర్వోబీలు, 45 పుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించామన్నారు. 174 స్టేషన్లలో హైస్పీడ్ వైఫై, 88 స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యలు ఎదురవుతున్నాయని, దీనివల్ల పనుల ప్రగతి మందగిస్తోందని, వేగవంతంగా అ భివృద్ధి కార్యక్రమాలు ముం దుకుపోవాలం టే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కార్య క్రమంలో రాష్ట్ర మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైల్వేశాఖ అధికా రులు పాల్గొన్నారు.