calender_icon.png 23 May, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేని ఇంటికి నంబర్లు

22-05-2025 12:00:00 AM

  1. మున్సిపల్ అధికారుల లీలలు!
  2. ఆ నంబర్లతో ఆస్తుల బదలాయింపు
  3. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

భద్రాద్రి కొత్తగూడెం, మే 21 (విజయ క్రాంతి) పరిపాలన పారదర్శకంగా నిర్వహించకపోవడం అక్రమార్కులకు వరంగా మా రింది. రూ  కోట్ల విలువగల ఆస్తులు అక్రమాలకుల పాలవుతోంది. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ అధికారు ల తీరు ప్రతి ఒక్కరిని విష్మయం కలిగిస్తోంది. ఒకవైపు అనుమతి లేని భవనాలు, మరోవై పు సక్రమం మాటున అక్రమాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, అసంపూర్తి ఇళ్ళకు,  లేని ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తా జాగా ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్లు కేటాయించడం మరీ విడ్డూరంగా ఉంది. పా ల్వంచ పట్టణం పరిధిలోని దమ్మపేట రోడ్డు లో సర్వేనెంబర్ 817/84 లో సుమారు 15 00 గజాల స్థలంలో నాలుగు ఇంటి నెంబర్లను మున్సిపాలిటీ అధికారులు దొడ్డిదారిన కేటాయించారని ఆరోపణలు వస్తున్నాయి. తీరా ఆ ప్రాంతంలో పరిశీలిస్తే అసలు ఇళ్ల నిర్మాణమే జరిగిన దాఖలాలు లేవు.

అక్రమార్కులు ఇచ్చిన ముడుపులకు తలొగ్గి లేని ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సదరు ఇంటి నెంబర్ పొందిన పెద్ద మనిషి ఆ స్థలాన్ని ఇంటి నెంబర్ల ఆధారంగా మరొకరికి బదలాయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీంతో రూ 4 కోట్ల వర కు చేతులు మారినట్లు తెలుస్తోంది. పాల్వం చ పట్టణంలో సర్వేనెంబర్ 999, 44 4,817,727 లలో రిజిస్ట్రేషన్ లను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు.

ఈ నెంబర్లు ప్ర భుత్వ , అసైన్మెంట్ భూములు కావడంతో  రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు. దీంతో కొంతమంది అక్రమార్కులు ఆయా సర్వే నెంబర్ల లోని భూములను బదలాయించడానికి దా ర్లు వెతుక్కుంటున్నారు. లింకు డాక్యుమెం టు, ఇంటి నెంబర్ వాటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటేనే రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. లింకు డాక్యుమెంట్ లభించకపోవడంతో దొడ్డిదారిన మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ పొంది నిషేదిత భూములను విక్రయించి దండుకుంటున్నారు.

ప్రస్తుతం పా ల్వంచ పట్టణంలో జోరుగా సాగుతున్న వై నం ఇదే. వాస్తవంగా ఇంటి నెంబర్ జారీ చేసే సమయంలో అధికారులు నిబంధనలు పాటిస్తే ఇలాంటి అక్రమాలకు తావుండదు. ఇటీవలనే కెనరసాని రోడ్డులో తప్పుడు పత్రాలతో అసంపూర్తి ఇంటికి నెంబరు పొం ది దాన్ని విక్రయించారు. ఆ విషయాన్ని విజ య క్రాంతి పత్రిక వెలుగులోకి తేవడంతో మున్సిపల్ అధికారులు ఆ ఇంటి నెంబర్‌ను రద్దు చేసిన విషయం విదితమే.

ప్రస్తుతం అధికారులు ఒక అడుగు ముందుకు వేసి అసలు ఇల్లు లేని వాటికి ఇంటి నెంబర్లు కేటాయించడం కొసమెరుపు. పేదవాడు ఇం టి నెంబర్ కావాలంటే సవాలక్ష నిబంధనలను విధించే అధికారులు, బడాబాబు లకు, అక్రమార్కులకు ఎలాంటి నిబంధన లేకుం డా ఇంటి నెంబర్లు కేటాయించడంలో మతలబు ఏంటో అర్థమయ్యే ఉంటుంది.