19-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 18 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని శాంతి నికేతన్ ఉన్నత పాఠశాలలో 2004 విద్యా సంవత్సరంలో పదో తర గతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పట్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు, వివిధ ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ముందుగా బ్యాచ్‌లో మృతి చెందిన మిత్రులను స్మరిం చుకుంటూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ, చిన్న పిల్లల్లా కేరింతలతో శాంతి నికేతన్ పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. పాఠశాల ప్రాంగణంలో అడుగుపెడుతూనే హోదాలను మరిచిపోయి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
20 సంవత్సరాల క్రితం తీపి ఙ్ఞాపకాలు, మధురస్మృతులను నెమరువేసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి సందడి చేశారు. అనంతరం విద్యను బోధించిన గురువులు, పాఠశాల కరస్పాండెంట్ రేపాల యాదయ్య, ప్రధానోపాధ్యాయులు మెంచు అశోక్ కుమార్, డైరెక్టర్ రాచకొండ రామచంద్రయ్య, ఉపాధ్యాయులు మోమిన్, బయ్య ఉపేందర్, మారం అనంత రాములు, పోతుల గోవర్ధన్,జీడి రమేష్ లను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రవణ్, దిలీప్, మధు, శేఖర్, రామోజీ, అశోక్, స్వాతి, విజయ్, ప్రవీణ్, శ్రీను, చంద్రశేఖర్, శ్రీరామ్, నాగరాజు, అనిల్, ఠాగూర్, బగ్గు, సాయి, రమేష్, నాగలక్ష్మి, జ్యోతి, నాగమణి, సైదమ్మ, శాంతి, మాధవి, విజయ, రవళి, అనిత, ఉమ, ఆనంద్, రవి, శంకర్, బిచ్చు, ఉస్మాన్,వెంకన్న, రాజేందర్, నవీన్, శ్రీను, భాస్కర్ పాల్గొన్నారు.