calender_icon.png 19 May, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఇసుక క్వారీకి భూమి పూజ

18-05-2025 11:26:23 PM

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండల పరిధిలో గల గొమ్ముగూడెం పంచాయతీలో సొసైటీ ద్వారా ఇసుక ర్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఈ క్రమంలో రెండవ ఇసుక క్వరీని అడవిపుత్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. 2012లో అడవిపుత్ర కమిటీ ఏర్పాటు చేసి ఈ  కమిటీ  ద్వారా 25 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రభుత్వం అప్పగించినా  కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్వారీ ఆగిపోయింది.  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  మళ్లీ ప్రభుత్వ అనుమతితో 98 వేల క్యూబిక్ మీటర్లు ఇదే కమిటీ  ద్వారా 7. 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చే విధంగా కమిటీ ముందుకు రావడం జరిగిందని అడవిపుత్ర కమిటీ అధ్యక్షురాలు పొడెం ఆదిలక్ష్మి వివరించారు. వీరి ఆధ్వర్యంలో 12 మంది డైరెక్టర్లతో గొమ్ముగూడెం ఇసుక క్వారీలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు.