calender_icon.png 14 May, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సమ్మేళనం

14-05-2025 12:00:00 AM

భీమదేవరపల్లి మే 12: (విజయ క్రాంతి):తస్నేహం చిరకాలం నిలిచే బంధం అని మరోసారి నిరూపితమైన సందర్బంగా, ముల్కనూర్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ ఒక భావోద్వేగ వేదికగా మారింది. 1999-2000 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, 25 సంవత్సరాల అనంతరం మే 12న సిల్వర్ జూబ్లీ సమ్మేళనంగా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రద్ధాభిమానాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలంతోనూ మారని మమకారాన్ని ప్రతిబింబించేలా, నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఒకరితో ఒకరు కౌగిలించుకుని ఆనందాశ్రువులు కార్చారు. ఈ జ్ఞాపకాల సందడి మధ్యే పాఠశాలలో వారికి బోధన కలిగించిన ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. సమ్మేళనం శుభాకాంక్షలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా సాగింది.

అనంతరం అందరికీ జ్ఞాపికలు పంపిణీ చేసి, విందు భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ వేడుకలో బేరె యాదగిరి, అల్లం నర్సయ్య, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, ప్రకాష్, ఉమామహేశ్వర్, సిహెచ్ గోపాల్ రెడ్డి, కాశిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీలత, హరిప్రియ, పున్నం రవీందర్, హిమసాగర్, వంగ శ్రీధర్, జయప్రకాష్, అనిత, సుజాత, నీలం రాజేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.