14-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 13(విజయక్రాంతి): ప్రభు త్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బోధన విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ వి ద్యార్థులు నమోదు పెంచే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికా రులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యుల వృత్తాంతర శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఇం గ్లీష్ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్ గా అన్ని క్లాసులు తీసుకొని ఇంగ్లీష్ అందరు పిల్లలకు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పించాలని సూచించారు. అదేవిధంగా సాంఘిక శాస్త్రం శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్లానింగ్ గూర్చి కోర్స్ వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో జరుగుతున్న మౌలిక , భాషా, గణిత సామర్థ్యం అభివృద్ధి, ప్రాథమిక పాఠశాలల ఎమ్మార్పీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతిరెడ్డిపల్లిలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పోతిరెడ్డిపల్లిలో 126 ఎస్జీటీ ఆర్పిలకు, 62 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సంగారెడ్డిలో 201, సోషల్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ల కు,సెయింట్ ఆర్నాల్ పాఠశాలలో 126 మం ది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 28 మంది డిఆర్పీలు, ఏఎంఓ బాలయ్య, సీఎం వో వెంకటేశం, కోర్స్ డైరెక్టర్లు విద్యాసాగర్, భాస్కర్, రోజారాణిపాల్గొన్నారు.