05-11-2025 05:20:35 PM
ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం దేవ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. తణుకు మహేష్, బూత్కూరి సతీష్- సౌజన్య దీపిక, కర్నాటి శంకర్- సారిక, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్ యజ్ఞంలో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందం, గట్టు రాం ప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకుళాదేవి, పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.