calender_icon.png 5 November, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరుకుల్లా వద్ద రోడ్డు ప్రమాదం..

05-11-2025 05:11:42 PM

వేగురుపల్లి అయ్యప్ప స్వాములకు గాయాలు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ళ గ్రామ పరిధిలో మానేరు బ్రిడ్జిపై బైక్ ను కారు ఢీకొంది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం వేగురవేల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాల దారుణ స్వాములు బత్తిని వీరస్వామి, నందికొండ రామ్ రెడ్డిలకు తీవ్రగాయాలు అయ్యాయి.

బుధవారం మంచిర్యాల జిల్లా గూడెం గుట్ట వద్ద మాల ధరించి వస్తున్న క్రమంలో నిరుకుల్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరికీ కాళ్లకు, శరీర భాగంలో తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.