16-12-2025 01:12:22 AM
సుల్తానాబాద్, డిసెంబర్ 15 (విజయ క్రాంతి):సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో సోమవార ము ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించు కొని అల్లంకి ఆనందం సావిత్రి ,సురేష్ స్వప్న దం పతులు, కాసం నాగరాజు సరిత దంపతులు స్వామి వారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం ఘనంగా చేయడం జరిగింది, ఈ కార్యక్రమం శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఆ లయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ దంపతుల చే ప్రత్యేక పూజలు చేయించారు , ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యు లు, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.