16-12-2025 01:13:40 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, డిసెంబరు 15 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పే ర్కొన్నారు. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు, ఉప సర్పంచ్ దాది లావణ్య హరీష్, వార్డు సభ్యులు దాది మోహన్, గజ్జెల రేవతి-రవి, చిందం శ్రీనివాస్, వే ముల ధనలక్ష్మి, చిప్ప స్రవంతి-సురేశ్, దూస మధు, చిప్ప కమల, కట్ట కావ్య శ్రీ-వేణు, రామిడి శ్రీ నివాస్ లు సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాం గ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, చిప్ప చక్రపాణి, శ్రీనివాస్, గుండ రాజేశం, దూసరాజు, సుధాకర్, కొలిపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.