23 April, 2026 | 2:41 PM

Breaking News

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు ఘన నివాళి

29-05-2025 12:00 AM

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా బాలాజీ నగర్ డివిజన్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మూసా పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉప్పు రాము  బుధవారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాజకీయ, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహానుభావుడని, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీ సుకొని యువత ముందుకు సాగాలన్నారు.