calender_icon.png 15 October, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా సమావేశంలో స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం

14-10-2025 10:41:11 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగింది. సుమారు 11 గంటలకు మీడియా సమావేశం ముగిసింది. వెంటనే వెనకాల నుండి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు వెనుక నుండి తోసి వేయడం జరిగింది. దీంతో ఎలక్ట్రాన్ మీడియాకు సంబంధించి కెమెరాలు కిందపడే పరిస్థితి నెలకొంది దీంతో ఎందుకు నెట్టారు అని మీడియా ప్రతినిధులు అడగడంతో నా డ్యూటీనే నెట్టి వేయడం, అంటూ ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ పార్టీ పోలీసులు మాట్లాడారు.

దీంతో పోలీసులకు, మీడియా ప్రతినిధులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది, స్పెషల్ పార్టీ పోలీసులు ఒకరిద్దరు ఫోటోలు, వీడియోలు తీసుకుంటు హంగామా చేసుకుంటూ, మా ఇష్టం మేము ఇట్లానే మాట్లాడతాము, ఇలాగే ఉంటాము ఏం చేసుకుంటారో, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నానా హంగామా సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమకొండ సిఐ మచ్చ శివకుమార్ వెంటనే అక్కడికి వచ్చి స్పెషల్ పార్టీ పోలీసులను అక్కడి నుండి పంపించడం జరిగింది. మీడియా ప్రతినిధులపై పోలీసులు తీరుపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.