calender_icon.png 15 October, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంబాపూర్‌లో ఘనంగా బోనాల పండుగ

14-10-2025 10:36:49 PM

ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి..

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరై, అమ్మవారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధిలో దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయని, బోనాల పండుగలు మన సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకలని తెలిపారు.

గ్రామ యువకులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజల ఐక్యతతో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, దయానంద్, సదానంద రెడ్డి, చాకలి ప్రకాష్, దయానంద్ సత్యనారాయణ, లక్ష్మణ్, రాజు, యాదగిరి,ప్రకాష్ యువకులు, సిజిఆర్ ట్రస్ట్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక భక్తులు భారీగా పాల్గొన్నారు.