calender_icon.png 15 October, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

14-10-2025 10:32:02 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): వారం రోజులలోగా భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహమ్మద్ నగర్, బిచ్కుంద, గాంధారి, లింగంపేట మండలాల తహసిల్దార్లతో సమావేశం నిర్వహించి భూభారతి పెండింగ్ దరఖాస్తుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొంటున్న ప్రజల భూ సమస్యను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నదని అన్నారు.

వెంటనే ప్రత్యేక డ్రైవర్ నిర్వహించి మీ మండలాల్లో ఉన్న భూభారతి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లోగా పరిష్కరించాలని తహసిల్దార్లను ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం త్వరగా జరిగేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్  విక్టర్, సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, కలెక్టరేట్ సూపరెంటిండెంట్ రషీద్, తదితరులు పాల్గొన్నారు.