calender_icon.png 15 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచకులకు (బెగ్గర్)ను సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశం..

14-10-2025 10:44:45 PM

కోదాడ: కోదాడ పట్టణంలో యాచకులు(బెగ్గర్స్) ఎంతమంది ఉన్నారని సర్వే చేయాలనిజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్డీవో సూర్యనారాయణ, కోదాడ పురపాలక సంఘ కమిషనర్ ఆదేశానుసారం మున్సిపాలిటీ సిబ్బంది సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం పునరావాస కేంద్రాలకు యాచకులు(బెగ్గర్స్)ను తరలించి ఉన్నట్లుగా తెలిపారు. ఈ సర్వేలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, సిఓ వెంకన్న, ఆర్పీలు, అజ్మీరా దుర్గ, తేజావత్ ధనలక్ష్మి, ప్రమీల, రాజ్యలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.