14-10-2025 10:38:38 PM
చిట్యాల (విజయక్రాంతి): చిన్నారి రిషికేష్ జన్మదిన వేడుకల్లో నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని ఆశీర్వదించారు. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నవీన్ కుమార్ - మానసల పుత్రుడు రిషికేష్ మొదటి పుట్టినరోజు సందర్భంగా నార్కట్ పల్లి పట్టణం శబరి గార్డెన్స్ లో నిర్వహించిన జన్మదిన వేడుకలలో నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని చిన్నారి రిషికేశ్ ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రిషికేష్ పెదనాన్న పెద్దమ్మ ఇల్లెందుల లింగస్వామి( కిట్టు) - మాధురి, తాత నానమ్మలు ఇల్లెందుల సత్యనారాయణ - భారతమ్మ, వడ్డే భూపాల్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.