calender_icon.png 15 October, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు

14-10-2025 10:46:37 PM

చిట్యాల (విజయక్రాంతి): యువతి అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామానికి చెందిన యువతి అక్టోబర్ 4న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆమె తండ్రి మంగళవారం చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బుస్సు రేణుక(24) ఎమ్మెస్సీ చదివి ఇంటి వద్దనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతుందని, ఈనెల 4న సాయంకాలం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు తన కూతురికి ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో వారు కంగారు పడి ఆమె బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఆమె కోసం వెతికారు. అయినప్పటికీ రేణుకా ఆచూకీ ఎక్కడ లభించకపోవడంతో ఆమె తండ్రి  స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చిట్యాల ఎస్సై తెలిపారు.