calender_icon.png 15 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓర్వలేకనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

14-10-2025 10:29:56 PM

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణలో రోజు రోజుకు ప్రజాధారణ పొందుతూ ఎదుగుతుంటే ఓర్వలేకనే నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్వాయి గ్రామంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ గుండాల అగడలకు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఏటి మధూకర్ కుటుంబాన్ని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ లతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక దాడులు చేస్తూ అనచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. ఇలాంటి పార్టీలకు గతంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. వెంటనే మండల పార్టీ అధ్యక్షుడు ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మధూకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మధూకర్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీ నారాయణ, పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, గన్నేరువరం పార్టీ మండల అధ్యక్షులు నికేష్, ఇల్లంతకుంట మండల పార్టీ మండల అధ్యక్షులు అనిల్, చొప్పదండి మండల పార్టీ అధ్యక్షులు మహేష్. కొండల్ రెడ్డి, చంద్రగిరి వేణు, కైలాస నవీన్ తదితరులు ఉన్నారు.