14-10-2025 10:52:06 PM
చివ్వెంల (విజయక్రాంతి): ఖాశింపేట గ్రామ శివారులో మంగళవారం మృతదేహం గుర్తించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు మేడబోయిన శివ శంకర్(31), తండ్రి యల్లయ్య, వృత్తి ఆపరేటర్, సుధాకర్ పివిసి వద్ద పనిచేస్తూ ఉండ్రుగొండ గ్రామం, చివ్వెంల మండలానికి చెందినవాడు. ఈ రోజు ఖాశింపేట శివారులో శివ శంకర్ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి మేడబోయిన యల్లయ్య(55) తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కనక రత్నం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మరణ కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని కోరుతున్నారు.