06-08-2025 10:41:40 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP State President Ramchander Rao)కు కమలం శ్రేణులు ఘన స్వాగతం చెప్పారు. బుధవారం కన్నాల ప్రధాన జాతీయ రహదారి వద్ద రామచందర్ రావుకు స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బెల్లంపల్లి మీదుగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శాలువాకప్పి స్వాగతం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర నాయకులు ఏమాజీ, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.