06-08-2025 10:43:08 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కలెక్టరేట్ లోని పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గద్దర్ ద్వితీయ వర్ధంతి వేడుకలను తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, గద్దర్ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి డెవలప్మెంట్ అధికారి ఎం.నరసింహస్వామి, జిల్లా సివిల్ సప్లై డి.ఎం కృష్ణవేణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి జ్యోతి, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయ టైపిస్ట్ రాము, సారధి టీం లీడర్స్ కొమిరే వెంకన్న, దర్శనం యుగంధర్, టీం సభ్యులు బండ వెంకన్న, మెరుగు రవీందర్ గౌడ్ , దేశెట్టి ప్రవీణ్ కుమార్, డప్పు శ్రీనివాస్, అశ్విని, కవిత, రాజ్యలక్ష్మి, రోజా, కీర్తి, సింధుజా, సిబ్బంది పాల్గొన్నారు.