calender_icon.png 7 September, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరి పుత్రులకు తీవ్ర అన్యాయం...

07-09-2025 12:05:09 AM

ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): లంబాడీల కారణంగా గిరి పుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ మలుగు జిల్లా అధ్యక్షుడు పర్షిక సతీష్ ఆరోపించారు   శనివారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశ పార్లమెంటులో ఆర్టిఐ వేసి 342 ఆర్టికల్ ప్రకారం 1976 లంబాడీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తింపు లేదని పత్రాలను సంపాదించి, 2011లో హైకోర్టులో మొదటిసారిగా లంబాడీలపై కేసు నమోదు చేయించినది ఆదివాసి సంక్షేమ పరిషతే అని అన్నారు.

1976 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ ఆడినన్స్ చట్టం ప్రకారం మూడు వర్గాలను ఎస్టీలుగా పేర్కొనబడిన కులాలలో బంజారా, సుగాలీలను పరిగణించలేదన్నారు. వీళ్ళు అసలైన ఆదివాసులు కాదని, వాళ్ళను ఎస్టి జాబితాలో పరిగణించడం వల్ల విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలలో అక్రమంగా లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. ఆదివాసులకు భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, ఎన్నో హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని పొందవలసిన గిరిపుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసియువతి, యువకులు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివాసి అస్తిత్వం కాపాడాలని పెద్ద ఎత్తున ఆదివాసులు కలిసికట్టుగా ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు .లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.