07-09-2025 10:20:00 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబుల పరిపాలన అంతం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చిన మహోన్నతమైన కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్(CPI District Secretary Panjala Srinivas) కొనియాడారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి 34 వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు ఆకర్షితుడైన రావి నారాయణరెడ్డి స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా అనేక పోరాటాలలో పాల్గొని జీవితం గడిపారని, హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబుల పాలనలో మగ్గుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ఆంధ్ర మహాసభలో చేరి ప్రజలను చైతన్య పరచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారని, వెట్టి చాకిరి రద్దు కావాలని, బానిసత్వం పోవాలని, ప్రజలను చిత్రహింసలు చేస్తున్న నిజాం రజాకార్ మూకలను ఎదిరించడానికి అనేక గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేశారని, సాయిద రైతాంగ పోరాటం ద్వారానే నిజాం నవాబులు ఎదుర్కోగలమని పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బూడిద సదాశివ,శాఖ కార్యదర్శులు చెంచల మురళి, గామినేని సత్యం, నగునూరి రమేష్, నాయకుల నల్లగొండ శ్రీనివాస్, నునావత్ శ్రీనివాస్, పి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.