07-09-2025 12:00:28 AM
చెన్నూర్,(విజయక్రాంతి): యువత అన్ని రంగాలలో ముందుండాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన మంద కృష్ణ మాదిగని మర్యాద పూర్వకంగా కలసిన కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వినర్ ఆసంపెల్లి సంపత్ కుమార్ తో ఆయన మాట్లాడుతూ దళితులు విద్య, వ్యాపార, రాజకీయాల్లో రాణించాలని, యువత దీనికోసం ముందు వరుసలో నిలబడాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.