07-09-2025 10:14:28 PM
హనుమకొండ (విజయక్రాంతి): మత సామరాస్యానికి ప్రతీక మిలాద్-ఉన్-నబి ర్యాలీ అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. హనుమకొండ చౌరస్తా నుంచి హజ్రత్ అబ్దుల్ నబీ షా సాహెబ్ దర్గా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మతసామరస్యానికి ప్రత్యేక ర్యాలీ అని, ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా యొక్క జన్మదినమైన రోజున ఆయన చూపిన మార్గం శాంతి, సహనం, ప్రేమ, దయ, మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం అని అన్నారు.
ప్రవక్త యొక్క జీవితం అనేది మానవతకు మార్గదర్శనం అన్నారు. ఆయన ఉపదేశాలు సమాజానికి శాశ్వత విలువలు అందించాయని, ఆయన చూపిన ప్రేమ, ఐక్యత మార్గాన్ని మనం అనుసరించాలని తెలిపారు. మన సమాజంలో మతసామరస్యం, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరుకుంటున్నా అని అన్నారు. మనం అన్ని మతాలను గౌరవిస్తూ, శాంతియుత సమాజం నిర్మాణంలో భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్రూ పాషా, జిల్లా మైనారిటీ చైర్మన్ అజీజ్ ఉల్లా, మాజీ కార్పొరేటర్ అబూబకర్, బోడ డిన్న, రజాలి, తబు తదితరులు పాల్గొన్నారు.