28-01-2026 12:00:00 AM
కేసముద్రం, జనవరి 27 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ప్రభుత్వం నుండి ఉత్తమ తహసీల్దారుగా ఎంపికై సోమవారం మహబూబా బాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కేసముద్రం తహసిల్దార్ వివేక్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిటీ సభ్యుడు రావుల మురళి సన్మానించారు. కేసముద్రం మండల అభివృద్ధికి తహసిల్దార్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపతహసిల్దార్ ఎర్రయ్య పాల్గొన్నారు.