28-01-2026 12:00:00 AM
నల్లగొండ టౌన్, జనవరి 27(విజయక్రాంతి): ‘నేను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లను బంద్ చేయించే వాడిని’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల నూతన భవనాలను అయ న మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నారాయణ, చైతన్య స్కూళ్లలో జరిగేదంతా దోపిడేనని అన్నారు.
నేను ఫోన్ చేసి రికమెండ్ చేస్తే మూడు లక్షలు ఫీజు చెప్పి రూ.2 లక్షలు తీసుకుంటారని నల్లగొండలో అయితే కొన్ని పాఠశాలలు నేను చెపితే ఫీజు తీసుకోరని, మరి కొందరు రూ.20వేలు మాత్రమే ఫీజు తీసుకుంటారన్నారు. కార్పొరేట్ విద్యా పేరి ట వ్యాపారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలన్నారు.
నల్లగొండను స్మార్ట్ సిటీగా అభివృ ద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఎంత నిధులు ఖర్చవుతాయో నల్లగొండ కూడా అంతే నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. పేదలకు ఇండ్లు, విద్య, వైద్యం, తాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు.ఈ రోజుల్లో మనం చూస్తున్న సంప్రదాయ విద్య, ఎక్కువ మా ర్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, పిల్లలను ఆలోచించేందుకు కాకుండా కేవ లం గుర్తుపెట్టుకుని పరీక్షలు రాయమని ఒత్తిడి ఉందన్నారు.
ఉస్మానియా కాకతీయ తర్వాత మ హాత్మా గాంధీ యూనివర్సిటీనే అతిపెద్ద యూనివర్సిటీగా ఉందని, ఇటీవలే మహా త్మా గాంధీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, బీ ఫార్మసీ కోర్సులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, ప్రతీక ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, డీఈవో భిక్షపతి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కె ట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొం డ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.