10-01-2026 02:04:27 AM
హైదరాబాద్, జనవరి 9 : స్కూల్ స్థా యిలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు కుంచెట్టి ఖేల్ క్షేత్ర నిర్వహిస్తున్న ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2026 పోస్టర్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. యువ క్రీడాప్రతిభను గుర్తించేందుకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని కితాబిచ్చారు. పాఠశాల స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు గొప్ప అవకాశంగా ఉన్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో సమగ్ర క్రీడాభివృద్ధికి దోహదపడే గొప్ప ప్రయత్నంగా కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు క్రీడల భవిష్యత్తును నిర్మించడంలో కీలకపాత్ర పోషిస్తాయ న్నారు. భవిష్యత్తులో నిర్వహించే క్రీడా కార్యక్రమాలకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని తెలిపారు. ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకూ సరూర్ నగర్ స్టేడియం, గచ్చిబౌలీ స్టేడియంలలో జరగనుంది.
అండ ర్ 6 నుంచి అండర్ 17 బాలురకు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ చాంపియన్‌షిప్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వెంకటేశ్, కుంచెట్టి ఖేల్ క్షేత్ర సీఈవో భవాని ప్రసాద్‌లను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సహ సంస్థాపకులు రాఘవేంద్ర యాదవ్, సభ్యులు సతీష్ కూ డా పాల్గొన్నారు.