calender_icon.png 12 January, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితిన్ నాయక్ సెంచరీ

10-01-2026 02:03:02 AM

  1. యువ క్రికెటర్ల మెరుపులు
  2. టీసీఏ తెలంగాణ గోల్డ్ కప్

హైదరాబాద్, జనవరి 9 : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డ్ కప్‌లో యువ క్రికెటర్లు సెంచరీలు మోత మోగిస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అప్పుడే నాలుగో శతకం నమోదైంది. టీసీఏ మహబూబ్‌నగర్ రూరల్ ప్లేయర్ నితిన్ నాయక్ సెంచరీతో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 107 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ రూరల్ 187 పరుగులు చేయగా టీసీఏ గద్వాల్ 135 పరుగులకే కుప్పకూలింది.

అలాగే టీసీఏ సైబరాబాద్ టీమ్‌లో లోక్‌నాథ్ నాయక్ 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీసీఏ సంగారెడ్డి జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్‌లో టీసీఏ మేడ్చల్ అర్బన్ జట్టు 8 వికెట్ల తేడాతో టీసీఏ వికారాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వికారాబాద్  70 పరుగులకే ఆలౌటవగా... సంతోష్ రెడ్డి 4 వికెట్లతో అదరగొట్టాడు.

ఛేజింగ్‌లో ప్రణీత్ రెడ్డి దూకుడుగా ఆడి 69 రన్స్ చేయడంతో మేడ్చల్ కేవలం కేవలం 5.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. సౌత్‌జోన్ లీగ్ మ్యాచ్‌లలో టీసీఏ మహబూబ్‌నగర్ అర్బన్ , టీసీఏ గద్వాల్‌పైనా, టీసీఏ మహబూబ్ నగర్ రూరల్, టీసీఏ నాగర్‌కర్నూల్ జట్టుపైనా, టీసీఏ మహబూబ్‌నగర్ అర్బన్ జట్టు టీసీఏ నాగర్‌కర్నూల్‌పై విజయం సాధించాయి.