20-09-2025 04:38:06 PM
గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో ఉన్న వికలాంగులను బిజెపి నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ 75 జన్మదిన పురస్కరించుకొని గోపాల్పేట మండలంలో మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపాల్పేట మండల బిజెపి అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉన్నటువంటి వికలాంగులందరిని సమాన భావనతో చూడాలని వారిని ఒకే భావంతో ఉండే విధంగా ప్రోత్సహించాలని సిద్ధాంతం తోటి పాటించాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల గురించి తెలియజేశారు. అనంతరం దివ్యాంగులను శాలువతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి కదిరి మధు, మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ మల్లికార్జున్ జనరల్ సెక్రెటరీ వామన్ గౌడ్ శివ సీనియర్ నాయకుడు అశోక్ రెడ్డి ఉపాధ్యక్షుడు రాము ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మహేష్ ఎస్టి మోర్చా అధ్యక్షుడు రాజేందర్. కోశాధికారి అనురాగ్ బూత్ అధ్యక్షుడు పాల్గొన్నారు.