20-09-2025 05:25:44 PM
చిట్యాల,(విజయక్రాంతి): పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చిట్యాల మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆరెగూడెంలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ తరపున సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బడుగు అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ అల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ... సుధాకర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అంకితభావంతో తను పనిచేసిన పాఠశాలల అభివృద్ధికి పాటుపడ్డారు.
సమానమైన, నాణ్యమైన, గుణాత్మకమైన, విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని రిటైర్మెంట్ అయిన మరుసటిరోజే తాత్కాలిక ఉపాధ్యాయులను కానీ విద్యా వాలంటీర్లు గాని నియమించినట్లయితే ప్రతి పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయని, ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని, గత సంవత్సరము రిటైర్ అయిన వారికి కూడా ఇంకా అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలాల అభివృద్ధికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు.