calender_icon.png 20 September, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళా ఉత్సవ్ జిల్లా స్థాయి పోటీల్లో బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

20-09-2025 04:26:52 PM

బాల్కొండ (విజయక్రాంతి): బాల్కొండ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ లో నిర్వహించిన కళా ఉత్సవ్-2025 పోటీల్లో బాల్కొండ స్థానిక జిల్లా పరిషత్ బాల్కొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభచాటారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ప్రదర్శించిన పదో తరగతి విద్యార్థిని సాయి శివాని జిల్లా స్థాయిలో మూడవ బహుమతి లభించింది. పాటల పోటీలలో రిమ్స్శా సుబుర్ అఫీజాకానం, మహేకుకౌసర్, ఆయేషా కానం, కాశ్మీర్ పై పాడిన దేశభక్తి పాట(తృతీయ బహుమతి) ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, గైడ్ టీచర్ కవితా రాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.