calender_icon.png 20 September, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ సంబురాలు

20-09-2025 05:56:21 PM

గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కార్యాలయాల్లో అధికారికంగా బతకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, టైనీటో యి స్ పాఠశాలల విద్యార్థిని లు బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి బతుకమ్మ పాటలు కోలాటాలు ఆటపాటలతో అలరించారు. అనంతరం బతుకమ్మను ఊరు చివరలో ఉన్న చెరువులోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ జిన్సన్, మీరా, ఇందిరా, తదితర ఉపాధ్యాయునీలు విద్యార్థులు పాల్గొన్నారు