calender_icon.png 20 September, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాలకు యువత బానిస కావద్దు

20-09-2025 05:54:00 PM

హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి

హుజురాబాద్,(విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 22 ట్రాక్టర్లు, 18 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించి, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాధవి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో తనిఖీలు భాగమని అన్నారు.

మత్తు పదార్థాలను యువత వయసుతో సంబంధం లేకుండా వినియోగిస్తున్నారని, అలాంటి వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలని అన్నారు. అలాగే, సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ తనిఖీలలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి, ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్, సైదాపూర్ ఎస్సై తిరుపతి, జమ్మికుంట ఎస్సై సతీష్, హుజురాబాద్ ఎస్సై  రాధాకృష్ణ లతో పాటు పోలీస్ సిబ్బంది 20మంది పాల్గొన్నారు.